News June 28, 2024

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి

image

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్‌పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదని రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటానని అన్నారు. కమీషనర్ రమేశ్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులతో మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. భవిష్యత్తులో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

Similar News

News October 25, 2025

హుజురాబాద్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సు

image

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని HZB డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సును NOV 3న నడుపుతున్నట్లు DM రవీంద్రనాథ్ తెలిపారు. NOV 3న బయలుదేరిన బస్సు KNR, HYD మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్తుంది. NOV 4న అరుణాచలం చేరుకుని గిరి ప్రదక్షిణ అనంతరం 5న తిరిగి ప్రయాణమై, 6న జోగులాంబ మీదుగా HZB చేరుకుంటుంది. చార్జీలు పెద్దలకు రూ.4,600, పిల్లలకు రూ.3,500. వివరాలకు డిపో కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

News October 25, 2025

KNR జిల్లాలో 16 మంది చిన్నారులకు ఓపెన్ హార్ట్ సర్జరీ

image

జిల్లా జనరల్ ఆసుపత్రిలో రెండు రోజులపాటు నిర్వహించిన గుండె వ్యాధి నిర్ధారణ శిబిరంలో 16 మంది చిన్నపిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరమని గుర్తించినట్లు జిల్లా ఇమ్యూనైజన్ (డీఐవో) అధికారి డాక్టర్ సాజిద్ తెలిపారు. అపోలో ఆసుపత్రి సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో మొత్తం 153 మంది పిల్లలు పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 23 మందికి చికిత్స అవసరమని, 14మందికి రివ్యూ నిర్వహించనున్నట్లు డీఐవో డాక్టర్ సాజిద్ తెలిపారు.

News October 25, 2025

వీణవంక: ప్రేమ వివాహ హత్య.. నలుగురికి జీవిత ఖైదే

image

సంచలనం సృష్టించిన వీణవంక ప్రేమ వివాహ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బ్రాహ్మణపల్లికి చెందిన ఎ.శ్రీనివాస్‌ను 2019లో ఆయన భార్య బంధువులు దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారణ కావడంతో నలుగురు కుటుంబ సభ్యులకు జీవిత ఖైదు విధించారు. ఐపీసీ సెక్షన్ 302 r/w 34 కింద తీర్పునిచ్చిన కోర్టు.. నిందితులైన మండల ఓదేలు, సంపత్, దేవేందర్, లక్ష్మిలకు శిక్షతో పాటు ఒక్కొక్కరికి ₹1,000 జరిమానా విధించింది.