News January 24, 2025

జావెలిన్ త్రోలో మెరిసిన సిద్దిపేట బిడ్డ

image

హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో గురువారం జరిగిన స్టేట్ లెవెల్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో సిద్దిపేట తడ్కపల్లికి చెందిన అంబటి రాజు గౌడ్ మొదటి స్థానం సాధించాడు. దీంతో మార్చిలో ఢిల్లీలో జరగబోయే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యారు. రాజుగౌడ్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఏఈఓగా పనిచేస్తున్నారు.

Similar News

News February 8, 2025

కాప్రా: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్

image

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022లో పెన్షన్ కోసం పలువురు వృద్ధులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక మంజూరు కావడం మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.

News February 8, 2025

మహబూబాబాద్: గ్రామాల్లో మొదలైన ‘స్థానిక’ సందడి!

image

ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. దీంతో మహబూబాబాద్ జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్య నేతలను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.

News February 8, 2025

కాప్రా: బతికున్నప్పుడు దరఖాస్తు.. చనిపోయాక పెన్షన్

image

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ పరిధిలో 2022లో పెన్షన్ కోసం పలువురు వృద్ధులు పలుమార్లు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 191 మంది పెన్షన్ మంజూరైనట్లు సర్కిల్ అధికారులు జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో 32 మంది మృతుల పేర్లు ఉన్నాయని కాప్రా సర్కిల్ అధికార వర్గాల సమాచారం. బతికి ఉన్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే చనిపోయాక మంజూరు కావడం మున్సిపల్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది.

error: Content is protected !!