News August 23, 2024

జిట్టా బాలకృష్ణకు తీవ్ర అస్వస్థత.. యశోదలో చికిత్స

image

తెలంగాణ ఉద్యమకారుడు, BRS నేత జిట్టా బాలకృష్ణ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా తనదైన పాత్ర పోషించారు. గత నాలుగు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Similar News

News September 8, 2024

NLG: అద్దె భవనాల్లో అంగన్వాడీలు 

image

NLG జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు అవసరమైన సొంత భవనాలు లేక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. అనేక మండలాల్లో ప్రస్తుతం ఇవి అద్దె గదులు, కమ్యూనిటీ హాళ్లు, పాత గదులలో కొనసాగుతున్నాయి. నల్గొండ పట్టణంలోని చాలా అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకుగా, అరకొర వసతులున్న ఆ భవనాల్లో చిన్నారులను ఆడించాలన్నా, వారికి భోజనం పెట్టాలన్న, చదువు చెప్పాలన్నా ఇబ్బందిగా మారింది.

News September 8, 2024

నేడు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి

image

రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం నల్గొండ జిల్లాకి రానున్నారు. ఉదయం 9:30 గంటలకు మంత్రి పట్టణానికి చేరుకుంటారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్గొండ పట్టణంలోని వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

News September 7, 2024

సూర్యాపేట: క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి

image

ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారం గ్రామ శివారులో క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి చెందాడు. కూడలికి చెందిన బానోతు హీరా వాటర్ మోటర్ తీయబోయి నీళ్లలో చిక్కుకుని మరణించాడు. గతంలో అదే క్వారీలో మిడతనంపల్లికి చెందిన ముగ్గురి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. హీరా మృతితో విషాదం అలుముకుంది.