News January 25, 2025
జిత్తు కోసం ప్రత్యేక టీం దింపుతాం: సీఐ రమేశ్

యాదగిరిగుట్టలో జై భవాని జ్యువెలరీ యజమాని జిత్తు సుమారు రూ. 10 కోట్ల నగదు, బంగారంతో ఉడాయించినట్లు తెలుస్తోంది. జిత్తు ది గుజరాత్ కాగా.. బాధితులంతా తాము కుదువపెట్టిన బంగారం రసీదులతో పాటు నగదు రసీదులతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు. జిత్తు కోసం ప్రత్యేక టీంను రంగంలోకి దింపి బాధితులకు న్యాయం చేస్తామన్నారు
Similar News
News October 18, 2025
రాప్తాడు, ధర్మవరంలో అరాచక పాలన: తోపుదుర్తి

రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాలలో అరాచక పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. MLA పరిటాల సునీత పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభుత్వానికి లేఖ రాసి 50 వేల ఇళ్ల నిర్మాణాలు ఆపారని అన్నారు. సునీత, పరిటాల శ్రీరామ్ చేనేతల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
News October 18, 2025
జనగామ: నేడు విద్యాసంస్థల స్వచ్ఛంద బంద్

స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేటి(శనివారం) రాష్ట్రవ్యాప్త బీసీ బంద్లో భాగంగా జనగామ జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ ప్రకటించాయి. సోమవారం దీపావళి పర్వదినం సెలవు ఉండడంతో విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు కలిసి వస్తున్నాయి.
News October 18, 2025
పవన్ కళ్యాణ్ వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ

జిల్లా పర్యవేక్షకులు అజయ్ కుమార్ తీరుపై జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జులు పలు విమర్శలు చేశారు. దీంతో డైరెక్ట్గా DCM పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జులను శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాలని సందేశాలు పంపారు. దీంతో నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేసిన జనసేన నేతలందరూ శుక్రవారం విజయవాడ బయలుదేరారు.