News April 2, 2025
జిన్నారం: వాహనం తనిఖీ చేస్తున్న ఎస్ఐని ఢీకొట్టిన కారు

జిన్నారం మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగలక్ష్మి తన సిబ్బందితో నిర్వహించారు. తనిఖీలు నిర్వహిస్తున్న నాగలక్ష్మిని మద్యం మత్తులో కారు ఢీకొని వెళ్లిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించడంతో కారును కొద్దిపాటి దూరంలో వదిలి పారిపోయారు. స్వల్ప గాయాలతో ఎస్ఐ నాగలక్ష్మి బయటపడ్డారు.
Similar News
News November 17, 2025
నల్గొండ జిల్లా ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్ బుక్.. తస్మాత్ జాగ్రత్త

‘Sharath Chandra Pawar IPS’ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాను సృష్టించారు. దాని నుంచి పంపించే మెసేజ్‌లు, ఫ్రెండ్ రిక్వెస్టులకు ఎవరూ స్పందించవద్దని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్ నుంచి డబ్బులు అడిగినా, ఇతర మెస్సేజ్‌లు ఏవి పెట్టినా ఎవ్వరూ స్పందించవద్దని ఆయన పేర్కొన్నారు.
News November 17, 2025
నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
News November 17, 2025
సినిమా అప్డేట్స్

* సన్నీ డియోల్ ‘జాట్-2’ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. తొలి పార్ట్‌ను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్టులో బిజీగా ఉండటమే కారణం.
* సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో ‘హీరామండి’ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
* యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపికవడం గర్వంగా ఉంది. పిల్లలు సంతోషం, ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి కృషి చేస్తా: కీర్తి సురేశ్


