News March 17, 2025
జియ్యమ్మవలసలో ఏనుగులు గుంపు సంచారం

జియ్యమ్మవలస మండలం నందివాని వలస, తోటపల్లి, సింగాణపురం గౌరీపురం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చెరకు, అరటి తోటల్లో ఏనుగుల గుంపు సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ.. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయవద్దని, రైతులు పొలాలకు వెళ్లొద్దని సూచించారు.
Similar News
News October 27, 2025
జీకేవీధి: అంతర్రాష్ట్ర సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత

మొంథా తుఫాను నేపథ్యంలో విశాఖ నుంచి జీకేవీధి మండలం సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను సోమవారం సాయంత్రం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విశాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ మాధురి తెలిపారు. తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 29వరకూ నిలిపివేస్తున్నామన్నారు.
News October 27, 2025
ప్రజావాణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎంపిక, భూవివాదాలు వంటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, తగు చర్యలు తీసుకోవాలని వారు జిల్లా అధికారులను ఆదేశించారు.
News October 27, 2025
మొంథా ఎఫెక్ట్.. ఏయూలో ఇంటర్వ్యూలు వాయిదా

మొంథా తుపాన్ కారణంగా ఏయూలో రేపు జరగాల్సిన వివిధ ఇంటర్వ్యూలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. ఈ ఇంటర్వ్యూలను నవంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరిపాలన భవనంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హాల్లో నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలు ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు.


