News April 3, 2025

జియ్యమ్మవలస మండలంలో ఏనుగులు గుంపు సంచారం

image

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. కురుపాం నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం ఉదయం కూడా జియ్యమ్మవలస నిమ్మలపాడు ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News October 21, 2025

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

AP: NTR జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో 20 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ntr.ap.gov.in/

News October 21, 2025

ఆక్వా ఎగుమతుల్లో 60% వాటా ఏపీదే: లోకేశ్

image

AP: ప్రపంచ కొనుగోలుదారులతో రాష్ట్ర ఆక్వా ఎగుమతిదారుల అనుసంధానానికి ట్రేడ్ మిషన్, నెట్వర్కింగ్‌ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా(SAI)ను కోరారు. కోల్డ్‌చైన్ మేనేజ్మెంటు, ప్యాకేజింగ్ రంగాల్లో ఆధునిక పరిజ్ఞానం, స్థిరమైన మత్స్యసంపద నిర్వహణకు నైపుణ్యాలు అందించాలన్నారు. ఇండియాలో ఆక్వా ఎగుమతుల్లో ఏపీ వాటా 60% పైగా ఉందని, 2024-25లో ₹66వేల కోట్ల ఎగుమతులు చేసిందని చెప్పారు.

News October 21, 2025

కృష్ణా: కుటుంబానికి దూరం.. ఒత్తిడితో ఉద్యోగం

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో పనిచేస్తున్న వేలాది మంది పోలీసులు పని ఒత్తిడిలోనే రోజులు గడుపుతున్నామని వాపోతున్నారు. సరెండర్ లీవులు, ఇతర సౌకర్యాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని, పండుగ రోజులలో సైతం కుటుంబానికి దూరంగా విధులలోనే ఉంటున్నామన్నారు. ఈ ఏడాది అయినా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తమ సంక్షేమం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.