News April 3, 2025
జియ్యమ్మవలస మండలంలో ఏనుగులు గుంపు సంచారం

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. కురుపాం నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. గురువారం ఉదయం కూడా జియ్యమ్మవలస నిమ్మలపాడు ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Similar News
News April 25, 2025
AMP: సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పనిచేయని సర్వర్లు

కోనసీమ జిల్లా వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సర్వర్లో పని చేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. దీంతో దూరప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు మండుటెండలో అవస్థలు పడ్డారు. సాంకేతిక లోపం వల్ల సర్వర్ ఆగిపోయిందని అధికారులు తెలిపారు. స్లాట్ బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్ లో ఆగిపోవడంతో ప్రజలు అధికారులను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News April 25, 2025
ఉచిత DSC కోచింగ్: మంత్రి సవిత

BC స్టడీ సర్కిల్ ద్వారా అన్ని వర్గాల డీఎస్సీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆన్‌లైన్ ఉచిత డీఎస్సీ కోచింగ్‌ను మంత్రి ప్రారంభించారు. శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ ఆచార్య యాప్ ద్వారా ఉచిత శిక్షణ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News April 25, 2025
తెలంగాణ సంక్షేమ పథకాలు ఆదర్శం: మంత్రి తుమ్మల

తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు దక్కాల్సిన పథకాలు అర్హులకు దక్కడం లేదని, అందుకే కులగణన జరిపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం ఖమ్మంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాజ్యాంగాన్ని అనుసరించి అందరూ సమానమైన హోదాలో ఉండాలని కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 14 నెలల్లో చేసిన సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రం చేయలేదన్నారు.