News February 2, 2025
జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరం: MP

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి, జిల్లాకు కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమని ఎంపీ రాఘురాం రెడ్డి అన్నారు. నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందించారు. సామాన్యులకు ఎలాంటి ప్రయోజనాలు కనిపించడంలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, నేషనల్ హైవేలు, కొత్తగూడెం ఎయిర్పోర్ట్పై ప్రస్తావించలేదన్నారు.
Similar News
News November 7, 2025
రేపు ప్రకాశం జిల్లాలో పాఠశాలలకు సెలవు రద్దు

మొంథా తుఫాను కారణంగా జిల్లాలో గత నెలలో ఐదు రోజులపాటు పాఠశాలలకు సెలవులు ఇచ్చిన కారణంగా ఈనెల 8న రెండో శనివారం అన్ని యాజమాన్య పాఠశాలలు యథావిధిగా నిర్వహించాలని DEO కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 2026 మార్చి వరకు ప్రతి రెండో శనివారం పాఠశాలలను నిర్వహించాలన్నారు. పాఠశాలల సిబ్బంది నియమాలు పాటించాలన్నారు.
News November 7, 2025
సూర్యాపేట: భార్యను చంపిన భర్త

సూర్యాపేట జిల్లా మోతె మండలం విభాళాపురంలో దారుణం జరిగింది. భర్త మద్యం మత్తులో భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 7, 2025
కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్

TG: గతంలో అభివృద్ధి చేసిన PJR, మర్రి శశిధర్ రెడ్డి HYD బ్రదర్స్ అయితే, ఇప్పుడు డెవలప్మెంట్ను అడ్డుకుంటున్న KTR, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ అని CM రేవంత్ విమర్శించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRRను అడ్డుకుంటోంది వీరేనని మండిపడ్డారు. BRS హయాంలో ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్నారు. KCR, KTR, హరీశ్ రావు వందల ఎకరాల్లో ఫామ్హౌస్లు నిర్మించుకున్నారని CM దుయ్యబట్టారు.


