News November 29, 2024
జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యం: టీజీ భరత్

జిల్లాకు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి సమీక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 1,000 హెక్టార్ల భూమి ఉంటే పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.
Similar News
News October 29, 2025
అనంత జిల్లాలో 80.4 మి.మీ వర్షపాతం నమోదు

అనంత జిల్లాలో కురుస్తున్న వర్షాలకు 80.4 మి.మీ కురిసింది. అత్యధికంగా తాడిపత్రి మండలంలో 10.8 మి.మీ, ఎల్లనూరు 10.2, పుట్లూరు 9.8, గుత్తి 6.8, పెద్దవడుగూరు 6.0, యాడికి 5.0, నార్పల 4.8, పెద్దపప్పూరు 4.4, గార్లదిన్నె 4.0, BKS 3.0, గుంతకల్ 2.4, శింగనమల 2.4, కూడేరు 2.0, ఆత్మకూరు 2.0, అనంతపురం అర్బన్ 2.0, పామిడి 1.4, కళ్యాణదుర్గం 1.2, రాయదుర్గం మండలంలో 1.0 కురిసింది. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి.
News October 29, 2025
గుత్తి: తుపాన్ ఎఫెక్ట్ ధర్మవరం – మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైలు రద్దు

మొంథా తుపాన్ ప్రభావంతో ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు సర్వీసును రద్దు చేసినట్లు రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. MTM – DMM వెళ్లనున్న రైలు సేవలు రద్దయ్యాయన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. బుధవారం ధర్మవరం నుంచి మచిలీపట్నం వెళ్లే రైలు (17215)ను కూడా రద్దు చేశామన్నారు.
News October 28, 2025
‘విధులకు హాజరు కాని ముగ్గురు డాక్టర్లకు మెమోలు జారీ’

ప్రభుత్వ డాక్టర్లు విధులకు సరిగా హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్వో దేవి హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో సరిగా విధులకు హాజరుకాని వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. జిల్లాలోని తిమ్మంపల్లి, నాగసముద్రం, బొమ్మనహాల్ వైద్యాధికారులకు మెమోలు జారీ చేశామన్నారు. వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాప్ విధుల్లో లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


