News March 19, 2025
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయండి: తిరుపతి కలెక్టర్

తిరుపతి జిల్లాలో ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలను.. పర్యాటక, అటవీశాఖ అధికారులు సమన్వయంతో అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, DFO వివేక్తో కలసి సమీక్షించారు. ఎర్రచందనం మొక్కలు జియో ట్యాగింగ్ తదితర అంశాల గురించి చర్చించారు. తిరుపతి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించారు
Similar News
News December 8, 2025
రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా జట్టు ఘన విజయం

గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ పోటీల్లో ఈస్ట్ గోదావరిపై కడప జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. కడప 16 ఓవర్లలో 171 పరుగులు చేయగా.. ఈస్ట్ గోదావరి 145 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్ ప్రవీణ్ 41 బంతుల్లో 85 పరుగులతో వీరవిహారం చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ వెంకటయ్య, వైస్ కెప్టెన్ సుబ్బరాయుడు ప్రవీణ్ను అభినందించారు. క్రీడాకారులను పలువురు ప్రశంసించారు.
News December 8, 2025
GNT: అలర్ట్..పరీక్షా ఫలితాలు విడుదల

ANU పరిధిలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన బీఫార్మసీ మూడవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు 34.39% ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 19వ తేదీ లోపు రూ. 2,070 నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.
News December 8, 2025
ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!

TGలో పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ నెల 11,14,17 తేదీల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి. తొలి విడతలో 4,236, రెండో విడతలో 4,333, మూడో విడతలో 4,159 గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం గ్రామాల్లోని స్కూళ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 14న ఆదివారం కాగా 11,17న పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రావచ్చు.


