News February 25, 2025
జిల్లాను ప్రమాద రహిత పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాను ప్రమాదరహిత పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. పరవాడలో భద్రతపై మంగళవారం నిర్వహించిన వర్క్‌షాప్‌లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలలో తీసుకోవలసిన భద్రత చర్యల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్నారు. వాటిని తప్పకుండా పాటించాలని సూచించారు. జీరో యాక్సిడెంట్ నినాదంతో యాజమాన్యాలు పనిచేయాలని సూచించారు.
Similar News
News December 1, 2025
జగిత్యాల: ‘వయోవృద్ధుల డిమాండ్లు తక్షణం నెరవేర్చాలి’

సీనియర్ సిటిజన్స్ డిమాండ్లు త్వరగా పరిష్కరించాలని టాస్కా జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. జగిత్యాల టాస్కా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ బస్సుల్లో 50% రాయితీ ఇవ్వాలని, హెల్ప్‌లైన్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
News December 1, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

AP: దిత్వా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ తిరుపతి, కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులిచ్చారు. అయితే తుఫాను బలహీనపడటంతో రేపటికి ఎలాంటి సెలవు ప్రకటనలు వెలువడలేదు. దీంతో యథావిధిగా విద్యాసంస్థలు కొనసాగనున్నాయి. తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పలు యూనివర్సిటీల పరీక్షలను వాయిదా వేశారు.
News December 1, 2025
కాకినాడ ఎంపీ ఉదయ్‌కి రెండో స్థానం

ఆంధ్రప్రదేశ్ ఎంపీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ రెండో స్థానంలో నిలిచారు. పూణేకు చెందిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సెఫలాజికల్ స్టడీ వారు నిర్వహించిన సర్వేలో ఆయన ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలపై చేసిన ఈ సర్వేలో ఉదయ్ శ్రీనివాస్ 8.6 స్కోరు సాధించి, బెస్ట్ పర్ఫామెన్స్ చూపారు.


