News February 1, 2025
జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై కలెక్టర్ ఫోకస్..!

ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ సూచించారు. NKP బౌద్ధస్తూపం, పాలేరు రిజర్వాయర్, ఖిల్లా, పులిగుండాల ప్రాజెక్ట్, వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎకోటూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఎకో టూరిజంకు బ్రాండింగ్ వచ్చేలా ప్రత్యేక లోగో, ట్యాగ్ లైన్ తయారు చేయించాలన్నారు.
Similar News
News February 14, 2025
నేలకొండపల్లి: అప్పుల బాధతో రైతు బలవన్మరణం

అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని మంగాపురం తండాలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తేజావత్ రామ(50) తనకున్న నాలుగు ఎకరాలకు తోడు మరికొంత కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడికి అప్పు చేశాడు.. ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో, అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు.
News February 14, 2025
ఆర్థిక అభ్యున్నతితోనే మహిళా సాధికారత: ఖమ్మం కలెక్టర్

ఆర్థిక అభ్యున్నతితోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం గ్రామీణ మహిళా వ్యాపారులు, సెర్ప్ సిబ్బందికి చిన్న తరహా వ్యాపారాల నైపుణ్యాభివృద్ధిపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం వల్ల కుటుంబాలు బాగుపడతాయని, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
News February 14, 2025
ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ హెచ్చరిక..!

మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. కేఎంసీ కార్యకలాపాలపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీజతో కలిసి సమీక్షించారు. పారదర్శకంగా పాలన అందించాలని, ఇష్టారీతిన వ్యవహరిస్తే వేటు తప్పదని స్పష్టం చేశారు. తనకు పని కంటే ఎవరూ ముఖ్యం కాదని, రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.