News July 6, 2024
జిల్లాలో ఆయ’కట్’కట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 124 ఎత్తిపోతల పథకాల కింద 32,880 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో 74 ఎత్తిపోతల పథకాలు సాగునీరందిస్తున్నాయి. 50 లిఫ్టులు పూర్తిగా పడకేశాయి. కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోని ఎత్తిపోతల పథకాలను వినియోగంలోకి తెచ్చేందుకు ఉభయ జిల్లాల అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరైనా పనులు జాప్యమవటంతో ఈ సీజన్కు సాగునీరందే పరిస్థితి లేకుండా పోయింది.
Similar News
News October 25, 2025
మొక్కజొన్న పంటకు మద్దతు ధర రూ. 2,400: కలెక్టర్

2025-26 మార్కెటింగ్ సీజన్లో మొక్కజొన్న పంటకు ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 కనీస మద్దతు ధరను ప్రకటించిందని, ఈ ధరకు కొనుగోలుకు పక్కా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. జిల్లాలో 1,705 ఎకరాల సాగవుతుందన్నారు. 5,456 మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనాతో కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
News October 24, 2025
తీగల వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

తీగల వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖమ్మం నగరంలో జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మున్నేరు నది రిటైనింగ్ వాల్ నిర్మాణం, కాల్వొడ్డు తీగల వంతెన పనులు, మున్నేరు భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్ వెంచర్ పురోగతి పనులను క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి స్థాయిలో నిర్మించాలన్నారు.
News October 24, 2025
ఖమ్మం: మైనార్టీలకు వృత్తి శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన మైనార్టీలకు వివిధ రంగాలలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ తెలిపారు. ప్రభుత్వ, జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థతో (ఎన్ఎస్డీసీ) అనుబంధం ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల శిక్షణా సంస్థలు నవంబర్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.


