News January 30, 2025

జిల్లాలో ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు తీసుకోవల్సిన చర్యలను వివరించారు. ఇంటర్మీడియట్ థీయరి పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయని తెలిపారు.

Similar News

News October 23, 2025

కృష్ణా: రెవెన్యూ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష

image

మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారులతో కలెక్టర్ బాలాజీ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్లు, మండల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. తహశీల్దార్లు, వీఆర్వోలు సర్వేయర్లతో కలిసి జిల్లాలో ఉన్న లేఔట్లను క్షేత్రస్థాయిలో సందర్శించి, ఖాళీ స్థలాలను గుర్తించాలన్నారు.

News October 23, 2025

ఉయ్యూరు: అత్యాచార నిందితుడిని రోడ్డుపై నడిపించిన పోలీసులు

image

ఉయ్యూరులో రెండు రోజుల క్రితం బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు చాంద్ బాషాను పోలీసులు గురువారం నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచే నిమిత్తం ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు పోలీసులు సంకెళ్లతో నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నిందితుడిని రోడ్డుపై తీసుకెళ్తుంటే జనాలు బారులు తీరి, చిన్నారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రార్థించారు.

News October 23, 2025

కృష్ణా: భారీ వర్షాలు.. రైతు కంట నీరు

image

రైతులకు ఈ సార్వా పంట మొదలు పెట్టినప్పటి నుంచీ కష్టాలే ఎదురవుతున్నాయి. వరి నారుమడి సమయంలో వర్షాలకు నారు పాడై, నారు దొరకని పరిస్థితి. ఆ తర్వాత యూరియా కొరత, ఎరువులు అందక సుదూర ప్రాంతాల నుంచి అధిక మొత్తంలో డబ్బు చెల్లించి మరీ వాడారు. పంటకు పెట్టాల్సిన పెట్టుబడి అంతా అయిపోయిందనుకున్న సమయంలో, ఈ తుఫాను వల్ల పొలాలన్నీ నేలమట్టం అయ్యాయి. దీంతో కళ్లముందే పంట నష్టం జరగడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.