News October 7, 2024

జిల్లాలో ఇప్పటికి 64డెంగీ కేసులు.. అప్రమత్తత అవసరం: శ్రీకాకుళం DMHO

image

శ్రీకాకుళం జిల్లాలో వైరల్‌ జ్వరాలు, మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ బొడ్డేపల్లి మీనాక్షి ఆదివారం సూచించారు. శీతల గాలులు మొదలైన తర్వాత వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండి ఇళ్ల పరిసరాల్లో దోమలు లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 64డెంగీ కేసులు నమోదైనట్లు తెలిపారు

Similar News

News November 5, 2024

శ్రీకాకుళంలో కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఏపీసేవా, మీసేవ, పీజీఆర్‌ఎస్ సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, సీపీవో, రహదారులు, భవనాలు, విద్యా, పంచాయతీ, ఉద్యాన, APEPDCL, డ్వామా, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మీకోసం అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

News November 5, 2024

అపార్ ఐడీ కార్డు నమోదు కీలకం: SKLM కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో అపార్ ఐడీ కార్డు నమోదుపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆరా తీశారు. మంగళవారం ఆయన ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. DEO తిరుమల చైతన్య జిల్లాలో నేటికి 60.679 శాతం పూర్తి చేశామన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపార్ ఐడీ కార్డు వెబ్‌‌సైట్లో విద్యార్థుల ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. అపార్ ఐడీ కార్డు విద్యార్థులకు చాలా కీలకమన్నారు.

News November 5, 2024

టెట్ పరీక్షలలో సత్తాచాటిన శ్రీకాకుళం వాసి కుంచాల జ్యోతి

image

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించింది. సోమవారం రాత్రి విడుదలైన పరీక్ష ఫలితాలలో శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగువలస గ్రామానికి చెందిన కుంచాల జ్యోతి తన సత్తాను చాటారు. ఈ పరీక్షలలో 150 మార్కులకు గాను ఆమె 149.07 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. పదవ తరగతి పరీక్షల నుంచి ఉపాధ్యాయ శిక్షణ కోర్సు వరకు ఈమె ఉత్తమ ఫలితాలను సాధించారు.