News March 28, 2025
జిల్లాలో ఉగాది పురస్కారాలకు 11 మంది ఎంపిక

ఏలూరు జిల్లాలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు విశిష్టమైన సేవలు అందించి ఉగాది పురస్కారాలకు ఎంపికైన పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అభినందనలు తెలిపారు. జిల్లాలో 11 మంది ఈ ఉగాది పురస్కారానికి ఎంపికైనట్లు తెలిపారు. అవార్డులు, పురస్కారాలు మరింత బాధ్యతను పెంచుతాయని ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేయాలని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.
Similar News
News October 24, 2025
ఓస్లో సదస్సుకు హాజరు కానున్న ఏలూరు ఎంపీ

నార్వే ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరుకానున్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో నార్వే ప్రభుత్వ సహకారంతో ఓస్లోలో నవంబర్ 2 నుంచి 8 వరకు సదస్సు నిర్వహిస్తున్నారు. భారతదేశం తరఫున హాజరయ్యే ఎంపీల బృందంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. గత నెల 24న ఆహ్వానం అందినట్లు ఎంపీ గురువారం తెలిపారు.
News October 24, 2025
AP న్యూస్ రౌండప్

*రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంటే జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారు: మంత్రి అనగాని సత్యప్రసాద్
*గోశాలలో గోవులు అధికంగా మరణిస్తున్నాయన్న నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: భూమన కరుణాకర్ రెడ్డి
*శ్రీశైలం దేవస్థానానికి 35 రోజుల్లో రూ.4,08,69,958 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడి
*విశాఖలో దొంగనోట్లు తయారు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన శ్రీరామ్ అలియాస్ గుప్తా అరెస్ట్. ప్రింటర్, ల్యాప్‌ట్యాప్ స్వాధీనం.
News October 24, 2025
మైనారిటీ వృత్తి శిక్షణకు సంస్థల దరఖాస్తుల ఆహ్వానం

మైనారిటీలకు ఉద్యోగావకాశాలు కల్పించే వృత్తి నైపుణ్య శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం. ముజాహిద్ తెలిపారు. గవర్నమెంట్ నైపుణ్యాభివృద్ధి సంస్థలతో అనుసంధానమైన ట్రైనింగ్ పార్ట్‌నర్ సంస్థలు నవంబర్ 6 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అవసరమైన పత్రాలు, ఆడిట్ రిపోర్టులు జతపరచాలన్నారు.