News April 2, 2025
జిల్లాలో ఉత్పాదకత పెరగాలి: కలెక్టర్ దినేష్

వ్యవసాయ అనుబంధ రంగాల్లో 15శాతం వృద్ధి సాధించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. అన్ని రంగాల్లో జిల్లాలో ఉత్పాదకత పెరగాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. రైతులకు సేంద్రీయ వ్యసాయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో 104 చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. 5,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కాఫీ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.
Similar News
News November 14, 2025
అండర్-14 ఉమ్మడి గుంటూరు జిల్లా క్రికెట్ టీం కెప్టెన్గా బాపట్ల విద్యార్థి

ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-14 క్రికెట్ టీం కెప్టెన్గా బాపట్ల విద్యార్థి అబ్దుల్ సాద్ ఎంపికయ్యాడు. అతని ఎంపిక జిల్లాకు గర్వకారణమని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు రఘునాథ్ తెలిపారు. శుక్రవారం నుంచి నిర్వహించనున్న సెంట్రల్ జోన్ మ్యాచ్ అండర్-14 జోన్ మ్యాచ్లో గుంటూరు జిల్లా టీం ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తేవాలని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ రాంమోహన్ రావు ఆకాంక్షించారు.
News November 14, 2025
‘జూబ్లీ’ రిజల్ట్స్: రేవంత్ ప్రచారం పట్టం కట్టేనా?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం CM రేవంత్కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. దీనికి కారణం ఆయనే స్టార్ క్యాంపెయినర్ కావడం. 2014 నుంచి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని రోజుల తరబడి రేవంత్ ప్రచారంలో పాల్గొన్నారు. ఆయనకు మంత్రులు కూడా తోడవటంతో ప్రచారం జోరందుకుంది. అలాగే గత ఎన్నికల్లో నవీన్ ఓటమి కూడా ఈసారి ఓటింగ్పై ప్రభావం చూపిందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
News November 14, 2025
చేతికి కంకణం ఎందుకు కట్టుకోవాలి..?

పూజ తర్వాత చేతికి కంకణం కట్టుకోవడం మన ఆచారం. పూజా ఫలం ఈ కంకణం ఉన్నన్ని రోజులు మనతోనే ఉండి, రక్షగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కంకణం మణికట్టుపై ఉన్న ముఖ్య నరాలపై ఒత్తిడి కలిగించి, జీవనాడి ప్రభావంతో హృదయ స్పందన రేటును సాధారణంగా ఉంచుతుందని నమ్ముతారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని బంధించి, శరీరాన్ని సమతుల్యంగా ఉంచే ఒక పవిత్ర రక్షా కవచం లాంటిది. దీనిని మగవారు కుడిచేతికి, స్త్రీలు ఎడమచేతికి ధరించాలట.


