News June 4, 2024
జిల్లాలో ఎన్నికల ఫలితాలు తేల్చనున్న 16,36,648 మంది ఓటర్లు
అనంతపురం జిల్లాలోని 8అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 26,900 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటు వేశారు. జిల్లావ్యాప్తంగా 20,18,162 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 9,97,792 మంది పురుషులు,10,20,124 మంది మహిళలు, 246 మంది ఇతరులు ఉండగా అందులో మొత్తం 16,36,648 మంది, 8,17,536 మంది పురుషులు, 8,19,004 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News September 12, 2024
సేవల బోర్డును ప్రదర్శించాలి: కలెక్టర్ డా.వినోద్ కుమార్
అనంతపురం జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులో బుధవారం వివిధ శాఖల అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్‌లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయల వద్ద మండల స్థాయిలో అందే సేవలను బోర్డులో ప్రదర్శించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
News September 12, 2024
అనంతపురంలో క్రికెటర్ల ప్రాక్టీస్
అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. హోటళ్ల నుంచి ప్రత్యేక బస్సుల్లో స్టేడియానికి చేరుకున్న ప్లేయర్లు నెట్స్‌లో చెమటోడ్చారు. డీ టీమ్ కెప్టెన్ అయ్యర్ సుమారు గంట పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మిగిలిన ప్లేయర్లు క్యాచింగ్, బంతి త్రో, వ్యాయామం వంటివి చేశారు. ఆటగాళ్లను బయటి వ్యక్తులు కలవకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. గురువారం నుంచి రౌండ్ 2 పోటీలు ప్రారంభం కానున్నాయి.
News September 11, 2024
తాడిపత్రికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
తాడిపత్రి ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో తాటిపల్లిగా పేరొందింది. తర్వాత తాటిపర్తిగా, కొన్నేళ్ల నుంచి తాడిపత్రిగా పిలవబడుతోంది. పూర్వం ఈ ప్రాంతంలో తాటిచెట్లు ఎక్కువగా ఉండటంతో తాటిపల్లి అనే పేరు వచ్చిందట. అలాగే తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించడంతోనూ ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఇక పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఆయన కుమారుడు నిర్మించారట.