News March 20, 2025
జిల్లాలో కాస్త తగ్గిన ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. గడచిన 24 గంటల్లో భీమారంలో 39.3℃, రాయికల్ 39.3, మల్లాపూర్ 39.2, గొల్లపల్లె 38.7, సారంగాపూర్ 38.4, మేడిపల్లి 38.3, జగిత్యాల 38.3, కథలాపూర్ 38.2, వెల్గటూర్ 38.2, పెగడపల్లె 37.9, జైన 37.7, సిరికొండ 37.6, రాయికల్ 37.5, జగ్గసాగర్ 37.4, మారేడుపల్లి 37.3, కోరుట్ల 37.3, మల్యాలలో 36.9, నేరెల్లా 36.9, మల్లాపూర్లో 36.6 ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News December 1, 2025
నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
News December 1, 2025
HYD: త్వరలో ఈ ప్రాంతల్లో సైతం జలమండలి..!

ORR బయట, లోపల ఉన్న ఏరియాలను సైతం జలమండలిలోకి కలపటం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తుంది. శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్ద అంబర్పేట్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ORR చుట్టూ లోపల, బయట విస్తరించనుంది. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ కనెక్షన్స్ ఇక జలమండలి పరిధిలోకి రానున్నాయి.
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.


