News March 20, 2025
జిల్లాలో కాస్త తగ్గిన ఎండ తీవ్రత

జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. గడచిన 24 గంటల్లో భీమారంలో 39.3℃, రాయికల్ 39.3, మల్లాపూర్ 39.2, గొల్లపల్లె 38.7, సారంగాపూర్ 38.4, మేడిపల్లి 38.3, జగిత్యాల 38.3, కథలాపూర్ 38.2, వెల్గటూర్ 38.2, పెగడపల్లె 37.9, జైన 37.7, సిరికొండ 37.6, రాయికల్ 37.5, జగ్గసాగర్ 37.4, మారేడుపల్లి 37.3, కోరుట్ల 37.3, మల్యాలలో 36.9, నేరెల్లా 36.9, మల్లాపూర్లో 36.6 ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News July 6, 2025
విజయవాడ: స్కిల్ హబ్‌లో పనులకు టెండర్‌లు

తుళ్లూరులోని అమరావతి స్కిల్ హబ్‌లో కాంక్రీట్ బ్లాక్‌ల పనులు పూర్తి చేసేందుకు CRDA శనివారం టెండర్‌లు ఆహ్వానించింది. రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల నిమిత్తం గుత్తేదారుల నుంచి టెండర్‌లు ఆహ్వానిస్తున్నామని విజయవాడలోని CRDA కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 14లోపు ఏపీ ఈ- ప్రాక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా బిడ్‌లను సమర్పించవచ్చని సూచించింది.
News July 6, 2025
ఊపిరి పీల్చుకున్న జపాన్

‘జపాన్ బాబా వాంగా’ <<16947282>>ర్యొ టట్సుకి<<>> జోస్యం చెప్పినట్లుగా ఇవాళ (జులై 5) జపాన్‌లో ఎలాంటి ప్రళయం సంభవించలేదు. అక్కడ 6వ తేదీ రావడంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేశంలో చిన్న భూకంపాలు తప్ప ఎలాంటి సునామీ రాలేదు. దీంతో టట్సుకి భవిష్యవాణి నిరాధారమైందని అక్కడి మేధావులు, సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ర్యొ టట్సుకి జోస్యంతో జపాన్‌లో ప్రళయం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.
News July 6, 2025
ఎన్టీఆర్: పరీక్షల ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ, LLM 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ANU విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.