News July 5, 2024
జిల్లాలో కొత్త మండలాలు ఏర్పాటయ్యేనా !?

రాష్ట్ర విభజన అనంతరం పాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలతోపాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐతే కొంత కసరత్తు జరిగినా ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇటీవలే పొంగులేటి పాలేరు నియోజకవర్గంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశంపై చర్చించగా.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొత్త మండలాల ఏర్పాటుకు సానుకూలత ఉన్న ప్రాంతాలను పరిగణనలోకి తీసుకోవాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.
Similar News
News November 11, 2025
ఖమ్మం: సదరం స్కామ్.. ఇద్దరు అధికారుల సస్పెన్షన్

సదరం ధ్రువీకరణ పత్రాల జారీలో గత రెండేళ్లలో అనేక అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలడంతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదిక ఆధారంగా సదరం విభాగానికి చెందిన ఓ సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేశారు. స్కామ్‌లో పాలుపంచుకున్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను తొలగించి, అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 11, 2025
ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియామకం

ఖమ్మం డీఈవోగా చైతన్య జైనీ నియమితులయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ డీఈవోగా పనిచేస్తూ సెలవులో ఉన్న జైనీని ఖమ్మం డీఈవోగా నియమించారు. ఇన్‌చార్జ్ డీఈవోగా ఉన్న శ్రీజ స్థానంలో రెండు రోజుల్లో చైతన్య జైనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. పూర్తిస్థాయి అధికారిని నియమించాలన్న ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌తో ఈ నియామకం జరిగినట్లు సమాచారం.
News November 11, 2025
ఖమ్మం: కౌలు రైతులు పత్తి విక్రయానికి నమోదు చేసుకోవాలి: కలెక్టర్

కౌలు రైతులు మద్దతు ధరకు తమ పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించుకోవడానికి అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. దళారుల జోక్యం లేకుండా కౌలు రైతులు నేరుగా పత్తి విక్రయం చేయగలరని చెప్పారు. ఇందుకు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని, అనంతరం సీసీఐ కేంద్రాల్లో పత్తిని విక్రయించాలని సూచించారు.


