News October 18, 2024
జిల్లాలో టూరిజం అభివృద్ధికి కృషి చేయాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్ ఛాంబర్ వద్ద జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి టూరిజం అధికారులతో జిల్లా టూరిజం అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలను ఆహ్లాదకరంగా ఉంచేందుకు బోటింగ్, వాటర్ ఫాల్స్, జిప్ రైడర్, రోబోటిక్ ఫౌంటైన్స్, తదితరాల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. పర్యాటకం అభివృద్ధికి తీరప్రాంతంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులను గుర్తించాలన్నారు.
Similar News
News November 21, 2025
మొగల్తూరులో సినిమా హాల్ పరిశీలించిన జేసీ

మొగల్తూరులోని శ్రీదేవి జానకి థియేటర్ను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పేరు మార్పుపై వచ్చిన విషయంపై థియేటర్ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రేక్షకుల సౌకర్యం కోసం యాజమాన్యానికి పలు సూచనలు చేశామన్నారు. థియేటర్లో ఎగ్జిట్ బోర్డులు, ఫైర్ సేఫ్టీ, తాగునీరు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ధియేటర్ సిబ్బందికి సూచించారు.
News November 21, 2025
ప.గో: 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ కేంద్రాలుగా మార్పు

పశ్చిమగోదావరి జిల్లాలో 70 మినీ అంగన్వాడీ కేంద్రాలు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి డి. లక్ష్మీ తెలిపారు. వీటిలో పనిచేస్తున్న 10వ తరగతి పాసైన 59 మందికి మెయిన్ కార్యకర్తలుగా పదోన్నతి లభిస్తుందని ఆమె అన్నారు. దీంతో వారి గౌరవ వేతనం రూ.7 వేల నుంచి రూ.11,500 లకు పెరుగుతుందని లక్ష్మీ తెలియజేశారు.