News August 11, 2024

జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలి: మంత్రి ఆనం

image

జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని జిల్లాపరిషత్‌ కార్యాలయంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పురోగతి, సాగునీటి కాలువల స్థితి గతులపై సోమశిల, తెలుగుగంగ, కండలేరు ప్రాజెక్టుల అధికారులతో మంత్రులు మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. 

Similar News

News October 13, 2025

విచారణ జరిపి న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

image

చట్ట ప్రకారం విచారణ జరిపి ప్రజలకు న్యాయం చేస్తామని ఎస్పీ డా.అజిత వేజెండ్ల తెలిపారు. నెల్లూరు పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేకు 125 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం ఉండరాదని.. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి అర్జీలను పరిష్కరించాలని సిబ్బందిని ఆమె ఆదేశించారు.

News October 13, 2025

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో మాజీ MLA అనుచరుడి మృతి

image

మాజీ MLA కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు పాలవెల్లి పద్మనాభరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జాతీయ రహదారిపై ముంగమూరు వద్ద బైక్‌పై వస్తుండగా కారు ఢీకొట్టింది. నెల్లూరులోని ఓ హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అల్లూరులో కాటంరెడ్డి అభిమానులతో కలిసి కావలికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో కాటంరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News October 13, 2025

నెల్లూరు: చేపలచెరువులకు ఆగని చికెన్ వ్యర్ధాల తరలింపులు

image

చేపల చెరువుల సాగుల్లో చికెన్ నిర్ధాల తరలింపు జిల్లాలో ఆగడం లేదు. ముఖ్యంగా కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉంది. బుచ్చి, పొదలకూరు, ఆత్మకూరు మండలాల నుంచి నిత్యం వాహనాల్లో చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్నారు. కొందరు వారి స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చేసినప్పుడు అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.