News August 11, 2024
జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపరచాలి: మంత్రి ఆనం
జిల్లాలో నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని జిల్లాపరిషత్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, సాగునీటి కాలువల స్థితి గతులపై సోమశిల, తెలుగుగంగ, కండలేరు ప్రాజెక్టుల అధికారులతో మంత్రులు మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
Similar News
News September 8, 2024
గూడూరు వైసీపీ నేతకు షాక్..!
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన కనుమూరు రవిచంద్రారెడ్డి అధికార ప్రతినిధిగా పలు టీవీ డిబేట్లలో YCP వాయిస్ వినిపించారు. MLAలు, MPలతో పాటు కొందరు నేతలతో టీవీ డిబేట్లలో పాల్గొనే వాళ్ల లిస్ట్‌ను YCP తాజాగా విడుదల చేసింది. వీళ్లను తప్ప మిగిలిన వాళ్లను డిబేట్లకు పిలవకూడదని.. వాళ్ల కామెంట్స్‌కు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆ జాబితాలో రవిచంద్రా రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
News September 8, 2024
గూడూరులో భారీగా గంజాయి స్వాధీనం
గూడూరు బైపాస్ జంక్షన్‌లో శనివారం సాయంత్రం గంజాయి దొరికింది. అనంతపురం, గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురి నుంచి 30 కేజీల 900 గ్రాముల గంజాయి సీజ్ చేసినట్లు రూరల్ ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. వీరు వైజాగ్ నుంచి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. గంజాయి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని.. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News September 7, 2024
నెల్లూరు: బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు
విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీటిని అందించాలనుకునే వారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0861 2331261, 79955 76699 కాల్ సెంటర్ ద్వారా సమాచారం పొం దాలని అధికారులు సూచించారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు CMRF పేరిట డీడీ తీసి, కలెక్టర్ కు అందజేయాలని, వీటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు.