News March 22, 2024

జిల్లాలో పదవ తరగతి గణితం పరీక్ష ప్రశాంతం

image

పది పరీక్షల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారిణి తాహేరా సుల్తానా తెలిపారు. జిల్లాలో మొత్తం 151 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా గణితం పరీక్షకు 21,539 మంది విద్యార్థులకు గానూ 391 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 30 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని డీఈఓ తెలిపారు.

Similar News

News October 28, 2025

కృష్ణా: నేడు సినిమా థియేటర్లు మూసివేత

image

మొంథా తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం ఒక్క రోజు జిల్లాలోని అన్ని సినిమా హాల్స్‌ను మూసి వేయాలని కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి సినిమా ప్రదర్శనలు వేయకుండా చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను ఆదేశించారు. తుపాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయంలో ప్రజలంతా తమ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు.

News October 27, 2025

కృష్ణా: రిలీఫ్ క్యాంప్‌ల్లో 1,482 మంది

image

మొంథా తుపాన్ తీవ్రత పెరుగుతుండటంతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వస్తున్నారు. జిల్లాలో మొత్తం 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రానికి 1,482 మంది ఈ కేంద్రాలకు చేరుకున్నారు. మచిలీపట్నం డివిజన్ లోని 92 కేంద్రాల్లో 1,230 మంది, గుడివాడ డివిజన్ లోని 36 కేంద్రాల్లో 82 మంది, ఉయ్యూరు డివిజన్ లోని 61 కేంద్రాల్లో 170 మంది పునరావాసం పొందుతున్నారు.

News October 27, 2025

కృష్ణా జిల్లాలో 188 రిలీఫ్ క్యాంప్‌లు

image

మొంథా తుపాన్ నేపథ్యంలో కృష్ణాజిల్లాలో 188 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 670 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మచిలీపట్నం డివిజన్ లో 93 కేంద్రాలు ఏర్పాటు చేయగా 534 మందిని, ఉయ్యూరు డివిజన్‌లో 61 కేంద్రాలకు గాను 141 మందిని తరలించారు. గుడివాడ డివిజన్‌లో 34 కేంద్రాలు ఏర్పాటు చేయగా ఒక్కరిని కూడా తరలించలేదు.