News September 27, 2024

జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేయాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో 50వ జిల్లా పరిశ్రమల ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనలకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News October 10, 2024

ఏపీ ప్రజలతోనూ రతన్ టాటాకు అనుబంధం: మంత్రి పయ్యావుల

image

ఏపీ ప్రజలతో దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాకు మంచి అనుబంధం ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అమరావతిలో మంత్రివర్గం టాటాకు నివాళులు అర్పించింది. ఉప్పు నుంచి ఉక్కు దాకా టాటా గ్రూప్ అనేక సంస్థలను స్థాపించిందని, లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిదని గుర్తు చేసుకున్నారు. టాటా సంస్థలు ఇప్పటికీ ఏపీ ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నాయని వెల్లడించారు.

News October 10, 2024

శ్రీ సత్యసాయి బాబాతో రతన్ టాటాకు అనుబంధం

image

టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్, ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా శ్రీ సత్యసాయిబాబా భక్తుడు. పలుమార్లు ఆయన పుట్టపర్తికి వచ్చారు. 2009 డిసెంబర్ 3న చివరిసారిగా సాయిబాబాను దర్శించుకున్నారు. సత్యసాయిబాబా సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై రతన్ టాటా ఆసక్తి చూపించేవారు. రతన్ టాటాకు ప్రశాంతి నిలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది.

News October 10, 2024

SKU పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

image

SKU పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్‌ ఫలితాలను యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జ్‌ వీసీ ప్రొఫెసర్‌ బి.అనిత విడుదల చేశారు. మొత్తం 8,551 మంది పరీక్ష రాయగా 3,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో BAలో 461 మందికి గానూ 108 మంది, BBAలో 818 మందికి గానూ 353 మంది, BCAలో 174 మందికి గానూ 62 మంది, BCMలో 4,512 మందికి గానూ 1,635 మంది, BSCలో 2,586 మందికి గానూ 1,234 మంది ఉత్తీర్ణత చెందారు.