News February 19, 2025

జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత

image

వేసవి నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 36.2℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో సరాసరి 21.7℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.

Similar News

News November 17, 2025

శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి: iBOMMA

image

ఐ-బొమ్మ వెబ్‌సైట్‌లో చివరి సందేశం దర్శనమిస్తోంది. ‘ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా, మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. అందుకు చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాం’ అని పేర్కొంది. ఇటీవల <<18309765>>పోలీసులు<<>> మూవీ పైరసీ చేస్తున్న iBOMMA గుట్టు‌రట్టు చేశారు. నిర్వాహకుడు ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు.

TDP సీనియర్ నేత ఆగయ్య మరణం విచారకరం: AP CM

image

KNR TDP సీనియర్ నేత, <<18309076>>ఎన్టీఆర్ వీరాభిమాని<<>> కళ్యాడపు ఆగయ్య మరణం విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. TDP ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలందిస్తోన్న ఆగయ్యను ఈ మధ్యనే మహానాడు వేదికగా తాను, బాలకృష్ణ సత్కరించుకున్నామని, ఎంతో అంకితభావంతో పార్టీకి ఆగయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని, కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం ఆగయ్య అని అన్నారు. ఆయన కుటుంబానికి CM ప్రగాఢ సానుభూతి తెలిపారు.