News February 23, 2025
జిల్లాలో ప్రజావాణి రద్దు: KMR కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తెలిపారు. శాసన మండల ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ అనంతరం ప్రజావాణి యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల విజ్ఞాపనలు తీసుకోవడానికి కలెక్టరేట్ లోని రూం నంబర్ 25లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 24, 2025
సిరిసిల్ల: మానాల గుట్టల్లో చిరుత సంచారం..?

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గుట్టల్లో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రుద్రంగి- మానాల మధ్యగల బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఓ ఆవుల మంద వద్దకు మంగళవారం రాత్రి చిరుత వచ్చినట్లు చెప్పారు. సమీపంలోని ఇటుక బట్టీలలో పనిచేసేవారు కూడా చిరుత వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వీడియో ఇక్కడిది కాదని వారు పేర్కొన్నారు.
News December 24, 2025
ఉద్యాన సాగు విస్తరణకు జిల్లాలో కొత్త ప్రణాళికలు: కలెక్టర్

ఉద్యాన పంటల విస్తరణ దిశగా జిల్లా కొత్త అడుగులు వేస్తోంది. జిల్లాలో కొత్తగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుకు విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. రబీ సీజన్లో 4,000 ఎకరాలు, ఖరీఫ్లో 6,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ అంశాలపై బుధవారం డీఆర్డీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News December 24, 2025
చేవెళ్ల ప్రమాదం.. ప్రధాన నిందితుడిగా టిప్పర్ ఓనర్

TG: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద NOV 3న RTC బస్సు-టిప్పర్ ఢీకొన్న <<18212535>>ఘటనలో<<>> టిప్పర్ డ్రైవర్ సహా18 మంది ప్రయాణికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో టిప్పర్ ఓనర్ లచ్చు నాయక్ను పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడిగా చేర్చారు. టిప్పర్ ఓవర్ లోడే ప్రమాదానికి కారణమని, ఆ సమయంలో అతడు టిప్పర్లోనే ఉన్నాడని తేల్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన లచ్చు నాయక్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.


