News September 22, 2024
జిల్లాలో ప్రతి ప్రోజెక్టుకు నీటిని అందిస్తాం: మంత్రి

బెలుగుప్ప మండలం జీడిపల్లి వద్ద ఉన్న హంద్రీనీవా పంప్ హౌస్‌ను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు కాలువ శ్రీనివాసులు, అమిలేనేని సురేంద్ర బాబు పరిశీలించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో హంద్రీనీవా కాలువలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రతి ప్రోజెక్టుకు నీటిని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జీడిపల్లి ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News March 13, 2025
ఇన్‌స్టా పరిచయం గొడవకు దారితీసింది!

ఇన్‌స్టా పరిచయం యువతి, యువకుడి గొడవకు కారణమైంది. అనంతపురంలోని SKUలో చదువుతున్న ఓ యువతికి తిరుపతి యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులు ఇరువురూ చాట్ చేసుకున్నారు. యువకుడు డెయిరీలో పని చేస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్‌గు గురైంది. వెంటనే బ్లాక్ చేసింది. ఆగ్రహానికి గురైన యువకుడు నిన్న నగరానికి వచ్చి యువతితో గొడవపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హెచ్చరించి యువకుడిని పంపించారు.

స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో ఎస్పీ సమీక్ష

సైబర్ నేరాలు, రోడ్డు సేఫ్టీ, డ్రగ్స్ అనర్థాలు, క్రైం అగనెస్ట్ ఉమెన్, తదితర నేరాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు భాగస్వామ్యులు కావాలని ఎన్జీవోల ప్రతినిధులకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో అనంతపురం పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఆయన సమావేశం నిర్వహించారు. సమష్టిగా కృషి చేసి, ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ కోరారు.