News February 16, 2025

జిల్లాలో ప్రశాంతంగా సేవాలల్ జయంతి వేడుకలు:ఎస్పీ

image

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఎలాంటి అవాంఛనియ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నథ్ కేకన్ తెలిపారు. నిన్న సాయంత్రం ఇరు వర్గాల మధ్య కొద్దీ పాటి అలజడి జరిగినప్పటికి పోలీస్ వారి ఆదేశాల మేరకు బందోబస్త్ నడుమ ఈరోజు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసినందుకు అధికారులకు, ప్రజలకు ఎస్పీ అభినందనలు తెలిపారు.

Similar News

News October 17, 2025

RCBని అమ్మేయాలని ప్రయత్నాలు?

image

IPL: RCBని $2 బిలియన్లకు అమ్మేందుకు పేరెంట్ కంపెనీ Diageo ప్రయత్నాలు చేస్తోందని Cricbuzz తెలిపింది. IPLలో లిక్కర్ బ్రాండ్ల యాడ్‌లపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన రూల్స్ తేవడంతో లాభదాయకం కాదని భావిస్తున్నట్లు సమాచారం. అధార్ పూనావాలా (సీరమ్ ఇన్‌స్టిట్యూట్), పార్థ్ జిందాల్ (JSW గ్రూప్), అదానీ గ్రూప్, ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ, మరో రెండు అమెరికా ప్రైవేట్ సంస్థలు ఆర్సీబీని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట.

News October 17, 2025

ONGCలో 2,623 అప్రెంటీస్ ఖాళీలు

image

ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్(ONGC)లో 2,623 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ వెలువడింది. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసైన వారు అర్హులు. వయసు 18-24 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్ 6. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
వెబ్‌సైట్: <>https://ongcindia.com/<<>>

News October 17, 2025

ఒకే స్కూల్‌లో అక్క–తమ్ముడు టీచర్లు!

image

నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన బాల స్వామి–నాగమణి దంపతుల కుమార్తె సారా పింకీ, కుమారుడు శామ్యూల్‌ మెగా డీఎస్సీ-2025లో టీచర్లుగా ఎంపికయ్యారు. వీరిద్దరికీ తుగ్గలి మండల హుసేనాపురం ఉర్దూ పాఠశాలలోనే పోస్టింగ్ రావడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నామని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.