News July 25, 2024

జిల్లాలో ప్రశాంతతకు భంగం కలిగించవద్దు: సత్యసాయి ఎస్పీ

image

సత్యసాయి జిల్లాలో జరుగుతున్న మొహర్రం వేడుకలు అందరూ సోదర భావంతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రత్న సూచించారు. మొహర్రం వేడుకలలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు వెళ్లకుండా అన్ని వర్గాల ప్రజలు సమన్వయంతో ఉండాలన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు.

Similar News

News October 1, 2024

రూ.3 కోసం హోటల్‌పై దాడి.. అనంతపురం జిల్లాలో ఘటన

image

రూ.3 కోసం హోటల్‌పై దాడి చేసిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పెద్దపప్పూరు మం. పరిధిలోని చీమలవాగుపల్లి సమీపంలో నారాయణస్వామి అనే వ్యక్తి హోటల్ నిర్వహిస్తున్నారు. కొంత మంది వ్యక్తులు ఓ వస్తువు కొనుగోలు చేయగా హోటల్ యజమాని రూ.3 తిరిగివ్వాల్సి ఉంది. తర్వాత ఇస్తానని చెప్పగా మాటామాటా పెరిగి హోటల్‌పై దాడికి పాల్పడ్డారు. ఈఘటనపై కేసు నమోదు చేసినట్లు పెద్దపప్పురు SI గౌస్ బాషా తెలిపారు.

News October 1, 2024

అనంతపురంలో టన్ను చీనీ రూ.18 వేలు

image

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో చీనీ కాయల ధరలు ముందుకు సాగడం లేదు. సోమవారం మార్కెట్‌కు 10టన్నుల చీనీ కాయలు దిగుమతి అయినట్లు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గోవిందు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో గరిష్ఠంగా టన్ను రూ.18 వేలు, సరాసరి రూ.15 వేలు, కనిష్ఠంగా రూ.10 వేల ధర పలికినట్లు వెల్లడించారు. మార్కెట్‌లో ధరలు పెరగకపోవడంతో దిగుమతి తగ్గినట్లు తెలిపారు. మరోవైపు జిల్లాలో కిలో టమాటా గరిష్ఠంగా రూ.48 పలుకుతోంది.

News October 1, 2024

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి సవిత

image

చేనేత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం పెనుకొండలోని క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. యువతీ, యువకుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు రూపకల్పన చేస్తున్నామని, ఆ డిజైన్లపై చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణతో సరిపెట్టకుండా చేనేత వస్త్రాలకు మార్కెట్ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.