News July 5, 2024
జిల్లాలో మంత్రి కొండపల్లి పర్యటన నేడు

రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం జిల్లాలో పర్యటిస్తారు. ఆయన ఉదయం 10 గంటల నుంచి జిల్లాపరిషత్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం 3 గంటలకు దత్తిరాజేరు మండలం కోమటిపల్లిలో జరిగే పార్టీ సమావేశంలో పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొవాలని అన్నారు.
Similar News
News December 12, 2025
జనవరి 23 నుంచి విశాఖలో బీచ్ ఫెస్టివల్

జనవరి 23 నుంచి 31 వరకు విశాఖ ఉత్సవ్ (బీచ్ ఫెస్టివల్) ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పోస్టర్‌ను ఆవిష్కరించారు. విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిపి విశాఖ ఉత్సవ్‌పై కమిటీ ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తామన్నారు.
News December 12, 2025
VZM: ‘హెల్త్ కవరేజ్‌లో ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలి’

పుష్పగిరి కంటి ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన న్యాయ అవగాహన సదస్సుకు సీనియర్ సివిల్ జడ్జి & డీఎల్ఎస్ఎ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. యూనివర్సల్ హెల్త్ కవరేజీలో ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత న్యాయ సేవలు కూడా అందరికీ అందిస్తామన్నారు.
News December 12, 2025
24న జాతీయ వినియోగదారుల దినోత్సవం: VZM JC

జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈనెల 24న నిర్వహించాలని విజయనగరం జేసీ ఎస్.సేథు మాధవన్ సూచించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ నుంచి వినియోగదారుల వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈసారి ‘డిజిటల్ న్యాయపాలన, సమర్థ సత్వర పరిష్కారం’ ఇతివృత్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిషులో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు.


