News June 15, 2024

జిల్లాలో మాతృ మరణాల నివారణకు చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

హైరిస్క్ కేసుల్ని ముందుగానే గుర్తించి పైస్థాయి ఆసుపత్రులకు చెకప్, కాన్పుకు పంపేందుకు ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. డెలివరీ అయిన స్త్రీని కనీసం 5 రోజులు తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచాలన్నారు. హైరిస్క్ గర్భిణీలకు ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు 8 నుంచి 9 నెలల మధ్యలో చేయాలని చెప్పారు. మాతృ మరణాల నివారణపై శుక్రవారం కలెక్టర్ సమీక్షించారు.

Similar News

News October 2, 2024

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై కేసు నమోదు

image

వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణపై గుంటూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై అంబటి మురళి, మరో 12 మంది సెప్టెంబర్ 28న పట్టణంలోని శ్రీసహస్రలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిరసన ధర్నా నిర్వహించారు. వైసీపీ నేతలు భక్తులను లోపలకు వెళ్లనివ్వకుండా ధర్నా చేశారని టీడీపీ నాయకుడు నరేశ్ ఫిర్యాదు చేయగా.. విచారించిన పోలీసులు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు.

News October 2, 2024

గుంటూరు: 97.22 శాతం మందికి పింఛన్ల పంపిణీ

image

గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛను పథకంలో మొదటి రోజు 97.22 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ నగదు రూ.4వేలు చొప్పున అందజేశారు. జిల్లాలో 2,56,017 మంది పింఛన్ దారులకు రూ.109.19కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. కాగా 2,48,901 మందికి రూ.106.10కోట్లు పంపిణీ చేశారు.

News October 1, 2024

గుంటూరు: విజిలెన్స్ ఇన్స్పెక్టర్‌గా చంద్రశేఖర్ బాధ్యతలు

image

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ ఇన్స్పెక్టర్‌గా కొమ్మాలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాల విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సు‌మెంట్ సీఐగా చంద్రశేఖర్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన అక్కిశెట్టి శ్రీహరి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చంద్రశేఖర్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన సీఐను కార్యాలయ సిబ్బంది అభినందించారు.