News August 18, 2024
జిల్లాలో మొదలైన రక్షా బంధన్ సందడి
సోదర సోదరీమణుల అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునేది రాఖీ. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మార్కెట్లలోని రంగు రంగుల భిన్నమైన రాఖీలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తమ ప్రియమైన సోదరుల కోసం రాఖీలు కొనేందుకు మహిళలంతా దుకాణాలకు వస్తున్నారు. గత ఏడాది కంటే ఈ సారి వ్యాపారం ఎక్కువ సాగుతోందని దుకాణ యాజమన్యం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 16, 2024
రూ.13.50 లక్షలు పలికిన నల్గొండ పాతబస్తీ లడ్డూ
నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ ఒకటో నంబర్ వినాయక లడ్డూ రూ.13.50 లక్షల వేలం పలికింది. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వినాయక లడ్డూను కైవసం చేసుకున్నారు. కాగా గతేడాది పాతబస్తీ ఒకటో నంబర్ వినాయక లడ్డూ వేలం రూ.36 లక్షలు పలికింది.
News September 16, 2024
ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, భూపాల్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.
News September 15, 2024
త్రిపురారం: మాజీ ఎంపీపీ భర్తపై కత్తితో దాడి
త్రిపురారం మాజీ ఎంపీపీ అనుముల పాండమ్మ భర్త అనుముల శ్రీనివాస్ రెడ్డిపై ఆదివారం సాయంత్రం ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. తాగిన మైకంలో ఉన్న యువకుడు ఓ విషయంలో న్యాయం చేయలేదంటూ శ్రీనివాస్ రెడ్డి పై దాడి చేయడంతో కడుపులో రెండు చోట్ల గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదు తరలించారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.