News April 8, 2025
జిల్లాలో రూ.14 కోట్లు పెరిగిన రిజిస్ట్రేషన్ ఆదాయం !

ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,43,420 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వాటి ద్వారా రూ.412 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. ఇక 2024-25 సంవత్సరంలో 1,40, 845 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వాటి ద్వారా రూ.426 కోట్లు ఆదాయం సమకూరింది.
Similar News
News October 19, 2025
బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలి: ఎస్పీ

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు. దీపావళి సందర్బంగా ఆదివారం జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. బాణాసంచాకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి లేదా పెద్దల పర్యవేక్షణలో కాల్చాలని కోరారు. కాటన్ దుస్తులను ధరించి మతాబులు కాల్చాలన్నారు. మతాబులు కాల్చిన తర్వాత వ్యర్దాలు సురక్షితమైన ప్రదేశాలలో వేయాలన్నారు.
News October 19, 2025
ఘనంగా పైడిమాంబ కలశ జ్యోతి ఊరేగింపు

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో, వేద పండితులు పైడిమాంబ దీక్ష దారులు పెద్ద సంఖ్యలో ఆదివారం సాయంత్రం పైడితల్లి అమ్మవారి వనంగుడి నుండి చదురగుడి వరకు కలశ జ్యోతి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News October 19, 2025
గజ్వేల్: పీహెచ్సీ తనిఖీ చేసిన కలెక్టర్.. సీరియస్

గజ్వేల్ మండలం అహ్మదీపూర్ పీహెచ్సీని జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్, సంతకాల్లో తేడాలు గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి రాకుండానే సంతకాలు చేసినట్లు గుర్తించి, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీఎంహెచ్ఓను ఆదేశించారు.