News January 12, 2025
జిల్లాలో రూ. 14 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం: మంత్రి టీజీ

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో సెమీ కండక్టర్ రంగంలో రూ. 14 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదిరిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. ఇండిచిప్ సెమి కండక్టర్ లిమిటెడ్ కంపెనీ తన భాగస్వామి జపాన్‌కు చెందిన యిటోయే మైక్రో టెక్నాలజీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో హైదరాబాదులో మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎం.ఓ.యూ కుదుర్చుకున్నట్లు మంత్రి టీజీ భరత్ తెలిపారు.
Similar News
News January 9, 2026
సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ తప్పనిసరి: కలెక్టర్

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ప్రతిరోజూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. ఎంపీడీవోలు, సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. తక్కువ హాజరు శాతంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీల్డ్‌కు వెళ్లే ముందే సచివాలయంలో హాజరు నమోదు చేయాలని స్పష్టం చేశారు. హాజరు ఉన్న రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తామని కలెక్టర్ హెచ్చరించారు.
News January 9, 2026
పారిశుద్ధ్య పనులపై కలెక్టర్ ఆదేశాలు

గ్రామాల్లో ఇంటింటి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనులు ప్రజలు సంతృప్తి చెందేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలీ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. ప్రతి పంచాయతీలో రోజువారీ చెత్త సేకరణ జరగాలన్నారు. డ్రైన్లు, రోడ్లు, బహిరంగ ప్రదేశాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని, ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో డిప్యూటీ ఎంపీడీవోలు స్వయంగా పర్యవేక్షించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
News January 9, 2026
1100కు ఫోన్ చేయవచ్చు: కలెక్టర్

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. అలాగే అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.


