News June 13, 2024

జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి కృషి: ఎంపీ నగేశ్

image

జిల్లాలో వైద్యరంగం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్ పేర్కొన్నారు. ఎంపీను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీలు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా తన వంతు కృషి చేస్తానని ఎంపీ పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

ADB: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో మూడు విడతల ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు), జోనల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి సూక్ష్మ పరిశీలకులకు ఒక గ్రామ పంచాయతీని కేటాయిస్తామని, ఆ పరిధిలోని అన్ని వార్డులను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.

News December 6, 2025

ఆదిలాబాద్‌: మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి: కలెక్టర్

image

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో, ఆదిలాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో సఖి కేంద్రం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలపై హింస నిర్మూలనకు సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 6, 2025

ADB: ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంసీసీ కొనసాగుతుంది: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నందున, చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, ప్రకటనలు, అభివృద్ధి హామీలు వంటి చర్యలను తక్షణమే నిరోధించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఎన్నికైన సభ్యులకు ఈ విషయం తెలియజేయాలని సూచించారు.