News April 5, 2024
జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలి: కలెక్టర్ ప్రియాంక అల

జిల్లాలో శిశు మరణాలను అరికట్టాలని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. శిశు మరణాలపై వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలని, చిన్న పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే సమీపంలోని పీహెచ్సీకి తరలించాలని సూచించారు. డీఎంహెచ్ఓ జీవీఎల్ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్ఓ సుకృత, డీఐఈఓ బాలాజీ, సర్వజన ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ నర్సింహారావు తదితరులతో సమీక్ష నిర్వహించారు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: 20 ఏళ్ల జైలు శిక్ష.. రూ.లక్ష జరిమానా

గంజాయి రవాణా కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 22.150 కేజీల గంజాయితో పట్టుబడిన రాజస్థాన్కు చెందిన భాగ్ చంద్ బైర్వా (A1)కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, రూ.లక్ష జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి గురువారం తీర్పు చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉండటంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.
News December 4, 2025
ఖమ్మం: ఆహార శుద్ధి రంగంలో నిపుణుల కొరతపై ప్రశ్నించిన ఎంపీ

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఖమ్మం ఎంపీ రఘునాథరెడ్డి ప్రశ్నించారు. కేవలం మూడు శాతం కార్మికులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతిక వినియోగ వివరాలు తెలపాలని లోక్ సభలో కోరారు. దీనికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రవ్ నిత్ సింగ్ బిట్టు లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
ఖమ్మం: స్కూటీని ఢీకొన్న లారీ.. వ్యక్తి స్పాట్ డెడ్

ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. డోర్నకల్కు చెందిన మునగల వీరభద్రం(55) స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రంకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సీఐ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.


