News February 25, 2026
జిల్లాలో సజావుగా ఇంటర్ పరీక్షలు: కలెక్టర్

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23న ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందని వివరించారు.
Similar News
News April 14, 2026
విద్యార్థి కాళ్లకు సంకెళ్లు వేసిన టీచర్

బనగానపల్లెలో సోమవారం అమానుష ఘటన జరిగింది. ఓ పాఠశాల విద్యార్థి అల్లరి చేశాడనే నెపంతో ఉపాధ్యాయుడు బాలుడి కాలికి ఇనుప గొలుసులతో చెక్కమొద్దును కట్టారు. ఆ సంకెళ్లతోనే బాలుడు రోడ్డుపైకి రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన టీచర్‌ను పోలీసులు మందలించినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2026
నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.
News April 14, 2026
ములుగు: ఇంటర్ ఫలితాల్లో టాపర్లుగా అక్కా, తమ్ముడు

ఏటూరునాగారంలో అక్కా-తమ్ముడు టాపర్లుగా నిలిచి అందరి ప్రశంసలు పొందారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న పెండ్యాల చైత్రశ్రీ 982 మార్కులు సాధించి కళాశాల, మండల టాపర్‌గా నిలిచింది. అదే కళాశాలలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న ఆమె తమ్ముడు చైతన్య 451 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచాడు. ఒకే కళాశాలలో చదువుతూ ఇద్దరూ టాపర్లుగా నిలవడం విశేషం.


