News April 15, 2025

జిల్లాలో 121 దరఖాస్తులు వచ్చాయి: అనకాపల్లి కలెక్టర్

image

జిల్లాలో గల పరిశ్రమలలో భద్రత ప్రమాణాలు పాటించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరిశ్రమలు మరియు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రభుత్వం ద్వారా 41 పరిశ్రమలకు రైతుల కోసం 121 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటికి రూ.12.91 కోట్ల రాయితీకి కమిటీ ఆమోదం తెలిపిందని అన్నారు.

Similar News

News October 31, 2025

TG SET దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌ అర్హత కోసం నిర్వహించే TG SET-2025 దరఖాస్తు గడువును పొడిగించారు. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులో తప్పుల సవరణకు నవంబర్ 26 నుంచి 28 వరకు అవకాశం ఇస్తారు. డిసెంబర్ 3న హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/

News October 31, 2025

వరంగల్: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్

image

సీఎం రేవంత్ రెడ్డి నేడు హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌ ద్వారా మధ్యాహ్నం 1.15–1.45 గంటల మధ్య హుస్నాబాద్‌, హన్మకొండ, వరంగల్‌ లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. 2.00–2.30 గంటల వరకు రంగంపేట, సమ్మయ్యనగర్‌, పోతన్ననగర్‌లను సందర్శించి, 3.00కు ఐడాక్‌లో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.15కు తిరుగు పయణమవుతారు.

News October 31, 2025

అమరావతి, గన్నవరంలో మెగా రైలు టెర్మినళ్లు!

image

AP: అమరావతి, గన్నవరంలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. అమరావతిలో 8 రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ట్రైన్ల హాల్టింగ్ ఉంటుంది. భవిష్యత్తులో 120 రైళ్లు రాకపోకలు సాగించేలా దీన్ని అభివృద్ధి చేస్తారు. దీనికోసం 300 ఎకరాల అవసరముంది. అటు గన్నవరంలో ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్స్ ఉండగా విజయవాడకు ప్రత్యామ్నాయంగా 10 లైన్లు ఏర్పాటు చేస్తారు. దీనికి 143 ఎకరాలు కావాలి.