News March 17, 2025
జిల్లాలో 128 కేంద్రాలు.. 26,497 విద్యార్థులు

పల్నాడు జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలకు మొత్తం 128 కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈవో చంద్రకళ తెలిపారు. ఆ పరీక్షా కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వారిలో 12,869 మంది రెగ్యులర్ బాలురు, 12,778 మంది రెగ్యులర్ బాలికలు ఉన్నారు.586 మంది ప్రైవేట్ బాలురు,304 మంది బాలికలు ప్రైవేటుగా పరీక్షలు రాస్తున్నారు. 6గురు ఫ్లయింగ్ స్క్వాడ్లు, 6 సీసీ కెమెరాలు ఉన్నాయన్నారు.
Similar News
News November 26, 2025
గొల్లగూడెంలో CM పర్యటన.. భద్రత ఏర్పాట్లు పరిశీలించిన SP

ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో డిసెంబర్ 1న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ ప్రతాప్ కిషోర్ భద్రత ఏర్పాట్లు పరిశీలించి అధికారులకి కీలక సూచనలు చేశారు. వాహనాల మళ్లింపు, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా ప్రతి అధికారి బాధ్యత వహించాలని ఆదేశించారు.
News November 26, 2025
ఏంటి బ్రో.. కనీస పోటీ ఇవ్వలేరా?

సొంత గడ్డపై సౌతాఫ్రికా చేతిలో 2 టెస్టుల్లోనూ ఓడిపోవడాన్ని IND ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోటీ ఇవ్వకుండా చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు. టెస్టులకు అవసరమైన ఓర్పు, సహనం మన క్రికెటర్లలో లోపించాయంటున్నారు. అలాగే కోచ్ గంభీర్ పనితీరూ సరిగా లేదని చెబుతున్నారు. ఆయన హయాంలోనే స్వదేశంలో NZ చేతిలో 3-0, ఆస్ట్రేలియాలో 1-3, ఇప్పుడు SA చేతిలో 0-2 తేడాతో పరాజయాలు పలకరించాయని గుర్తు చేస్తున్నారు.
News November 26, 2025
HYD: త్వరలో కొత్త బస్ డిపోలు.. ప్రతిపాదించిన ఆర్టీసీ

మహానగరం విస్తరించనున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు బస్సుల సంఖ్యను పెంచి అదనపు డిపోలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రస్తుతం గ్రేటర్లో 25 డిపోల పరిధిలో 3,100 బస్సులు సేవలందిస్తున్నాయి. బస్సుల సంఖ్యను పెంచి మరో 16 డిపోలను ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రచించింది. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుందని సమాచారం.


