News February 24, 2025
జిల్లాలో 144వ సెక్షన్ అమలు: భూపాలపల్లి కలెక్టర్

ఈ నెల 27న జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పోలింగ్ సందర్భంగా ఈ నెల 25న సాయంత్రం 4 గంటల నుంచి 27న సాయంత్రం 4 గంటల వరకు 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ అమల్లో ఉంటుందన్నారు. 144 సెక్షన్ అమలులో ఉంటుందని గుంపులుగా ఉండటం, ప్రచారం చేయడం నిషిద్ధమని స్పష్టం చేశారు.
Similar News
News July 8, 2025
చలాన్లు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.
News July 8, 2025
కామారెడ్డి మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్

కామారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా వాల్యను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్స్ విభాగంలో హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ డా.వాల్య ప్రమోషన్ పై జిల్లా మెడికల్ కళాశాలకు పిన్సిపల్‌గా రానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.
News July 8, 2025
మహబూబాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్

కాచిగూడ నుంచి మహబూబాబాద్, డోర్నకల్ మీదుగా తిరుపతి వెళ్లడానికి స్పెషల్ ట్రైన్ నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే ఎస్టీఎం రాజనర్సు తెలిపారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ స్పెషల్ ట్రైన్ జులై 10, 17, 24, 31 తేదీల్లో నడుపుతున్నామని ప్రయాణికులు గమనించాలని సూచించారు.