News October 26, 2024
జిల్లాలో 21వ జాతీయ పశుగణన ప్రారంభం: కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి 21వ జాతీయ పశు గణన సర్వే ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 21వ జాతీయ పశుగణన సర్వే ప్రారంభ సందర్భంగా సంబంధిత గోడ పత్రికను కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. పశుగణన సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లా పశువైద్యాధికారులు పశుగణన కోసం నియమించి, శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందితో 2025 ఫిబ్రవరి 28 వరకు గణన జరుగుతుందన్నారు.
Similar News
News November 12, 2024
ఏలూరు: జిల్లా జైల్‌ను పరిశీలించిన ఎస్పీ
ఏలూరు జిల్లా జైల్‌ను మంగళవారం జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ పరిశీలించారు. జైల్‌లో ముద్దాయిలకు కల్పిస్తున్న సౌకర్యాలను గురించి క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడుతూ ఖైదులు సత్ప్రవర్తనతో మేలగాలని సూచించారు. జైలు నుంచి బయటకు వచ్చినవారి జీవనోపాధి కోసం పోలీసు వారు నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో ఉద్యోగాన్ని కల్పిస్తామని తెలిపారు.
News November 12, 2024
ప.గో: వివాహితపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్
గోపాలపురం మండలంలో వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు SI సతీశ్ కుమార్ మంగళవారం తెలిపారు. SI వివరాల మేరకు..ఈ నెల 9న సదరు మహిళ ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అత్యాచారానికి పాల్పడ్డాడన్నారు. దీనిపై సోమవారం రాత్రి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారన్నారు. నిందుతుడిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
News November 12, 2024
ప.గో. జిల్లాలో రేంజ్ IG పర్యటన
ఏలూరు రేంజ్ IG అశోక్ కుమార్ సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు రూరల్ సర్కిల్, మొగల్తూరు పోలీస్ స్టేషన్లలో వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ వార్షిక తనిఖీల్లో పోలీస్ స్టేషన్లో నిర్వహించే పలు రికార్డులను పరిశీలించి, స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు.