News January 1, 2025

జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు : ASF SP

image

శాంతి భద్రతల దృష్ట్యా జిల్లావ్యాప్తంగా జనవరి 1 నుంచి 31వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని SP శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం SP మాట్లాడుతూ.. DSP, ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతులు లేకుండా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించరాదన్నారు.

Similar News

News December 1, 2025

సీఎం పర్యటనలో లోపాలు చోటు చేసుకోవద్దు: ADB కలెక్టర్

image

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాకు చేసే పర్యటనను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలన్నారు.

News December 1, 2025

బాధితుల సమస్యలను పరిష్కరించాలి: ADB SP

image

ఫిర్యాదుదారుల సమస్యల పట్ల బాధ్యత అధికంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి 28 ఫిర్యాదులు అందగా వాటిని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి పరిష్కరించాలన్నారు. ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నంబర్‌కు తెలియజేయలన్నారు. ఆయనతో పాటు సీసీ కొండరాజు ఉన్నారు.

News December 1, 2025

ADB: విదేశి విద్య కోసం ఫ్రీ కోచింగ్

image

ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ పాసైన విద్యార్థులకు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు కీలకమైన IELTS (ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం) ఉచిత శిక్షణ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ డిబిసిడబ్ల్యూఓ రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 21లోపు www.tgbcstudycircle.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.