News February 15, 2025

జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలు: కలెక్టర్‌

image

అధికారులందరు సమన్వయంతో పనిచేస్తూ పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను సజావుగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలన్నారు. జిల్లాలో 49 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News March 28, 2025

వరంగల్ మార్కెట్‌కి వరుసగా నాలుగు రోజులు సెలవులు

image

వరంగల్ నగరంలోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్‌కు ప్రభుత్వం వరుసగా నాలుగు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి తెలిపారు. ఈ సమయంలో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవని చెప్పారు. ఈనెల 29 అమావాస్య బంధు, 30 ఆదివారం, ఉగాది, సోమవారం రంజాన్,31 మంగళవారం రంజాన్ మరుసటి రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించబడింది. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2వ తారీకు ప్రారంభమవుతుందన్నారు.

News March 27, 2025

వరంగల్: మరమ్మత్తుల కారణంగా చర్లపల్లి వరకే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు

image

కృష్ణ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లడం లేదని రైల్వే జీయం అరుణ్ కుమార్ జైన్ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, కొన్ని మరమ్మత్తుల కారణంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ను చర్లపల్లి వరకే పరిమితం చేశామని, సికింద్రాబాద్‌కు పోవు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ప్రయాణికులు గమనించి, సహకరించాల్సిందిగా వారు కోరారు.

News March 27, 2025

WGL: ఈ వారంలో అధిక ధర పలికిన పత్తి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు మళ్ళీ ఊరటనిచ్చాయి. ఈ వారం మొదటి నుంచి పోలిస్తే ఈరోజు పత్తి ధర అధికంగా పలికింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 పలికిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ధర రూ.7050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

error: Content is protected !!