News June 20, 2024
జిల్లాలో 875 మంది పదోన్నతులు.. విధుల్లో చేరిక

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావటంతో వారు ఆయా స్థానాల్లో విధుల్లో చేరారు. జిల్లాలోని పండిట్, పీఈటీ, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. జిల్లాలో 954 మందికి పదోన్నతులు రాగా.. 875 మంది బుధవారమే విధుల్లో చేరినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. మిగతా వారు నేడు విధుల్లో చేరే అవకాశం ఉంది.
Similar News
News December 10, 2025
ఈ-కేవైసీ కారణంతో రద్దయిన రేషన్ కార్డులెన్ని?:ఎంపీ

దేశంలో ఈ-కేవైసీ చేయించుకోని కారణంగా రద్దయిన రేషన్ కార్డుల గణాంకాలను తెలపాలని ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి బుధవారం లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర వినియోగదారులు ఆహార ప్రజాపంపిణీ సహాయ మంత్రి నిముబెన్ జయంతి బాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అక్టోబరు నాటికి రాష్ట్రాల వారీగా రద్దయిన కార్డులు, ప్రస్తుత కార్డుల వివరాలను ఆమె సభకు అందించారు.
News December 10, 2025
ఖమ్మంలో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డు స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,41,137 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి, 4,220 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
News December 10, 2025
ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఏకగ్రీవాల జోరు

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 19 పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం నారాయణపురం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఖాతాలో చేరింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కాంగ్రెస్ మొత్తం 56 ఏకగ్రీవాలతో ముందంజలో ఉంది.


