News March 19, 2025
జిల్లాలో 9 మంది తహశీల్దార్లు బదిలీ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 9 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిరిసిల్లకు మహేశ్ కుమార్, ఎల్లారెడ్డిపేటకు సుజాత, వేములవాడ రూరల్ కు అబూబకార్, వేములవాడకు విజయ ప్రకాష్ రావు, ఈఓ విటీఎడీఎగా భూపతి, డీఏవోగా ఉమరణి, సూపరింటెండెంట్ కలెక్టరేట్‌గా రామచంద్రం బదిలీ అయ్యారు.
Similar News
News February 24, 2026
రాజమండ్రి కల్తీ పాల ఘటన.. ఏడుగురి పరిస్థితి విషమం

రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్ మంగళవారం కీలక వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించగా, మరో 15 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొందరిని వెంటిలేటర్, డయాలసిస్ పై ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు.
News February 24, 2026
చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 24, 2026
తూ.గో: కల్తీ పాలు తాగిన మరొకరి మృతి

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వెంకట్(7) మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. 18వ తేదీన కాకినాడ నుంచి ఈ బాలుడిని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌లో జాయిన్ చేశారని కేజీహెచ్ సూపరిండెంట్ ఐ.వాణి తెలిపారు. వచ్చేటప్పటికే రెండు కిడ్నీలు పాడయ్యాయని, ఇప్పటి వరకు 60 సార్లు డయాలసిస్ చేశామని, అయినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదని ఆమె Way2Newsకు వివరించారు.


