News May 10, 2024

జిల్లాలో 94% ఓటర్లకు స్లిప్పుల పంపిణీ పూర్తి: విశాఖ కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు పంపిణీ కార్యక్రమం 94% పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున తెలిపారు. మిగిలిన వారికి ఈరోజు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తామని తెలిపారు. అనివార్య కారణాల వల్ల ఓటర్ స్లిప్ తీసుకోని వారు ఓటర్ జాబితాలో పేరు ఉంటే పోలింగ్ రోజు స్లిప్పు తీసుకుని నేరుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, పోలింగ్ కేంద్రం వద్ద వీటికి ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 19, 2025

విశాఖపట్నం టుడే టాప్ న్యూస్

image

☞ పెందుర్తి నర్సింగ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ☞మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ☞కాపులుప్పాడ వద్ద అస్తిపంజరం కలకలం ☞ఎమ్మెల్సీ అభ్యర్థి రఘువర్మకే టీడీపీ మద్దతు: ఎంపీ ☞విశాఖ: పెళ్లి జరిగిన రెండు వారాలకే పరార్ ☞మధురవాడలో ఉరేసుకుని మహిళ మృతి ☞నేటి నుంచే పూర్ణామార్కెట్ దుర్గాలమ్మ జాతర ☞దువ్వాడలో ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల సస్పెండ్

News February 19, 2025

ఇళ్ల నిర్మాణాల్లో నాణ్య‌త‌కు పెద్ద‌పీట వేయాలి: జిల్లా కలెక్టర్

image

ఎన్.టి.ఆర్. కాల‌నీల్లో జ‌రుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్య‌త విష‌యంలో రాజీప‌డ‌కుండా ప‌నుల‌ను వేగ‌వంతంగా చేయాల‌ని జిల్లా క‌లెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. బుధ‌వారం స్థానిక క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగ‌తి, ఇసుక స‌ర‌ఫ‌రా, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న తదిత‌ర అంశాల‌పై ఆయన స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.

News February 19, 2025

మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

మధురవాడలో బుధవారం మరో సంచలనం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి మధురవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించారు. వెంటనే పీఎంపాలెం పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీఎంపాలెం పోలీసులు ఒడిశా పోలీసులకు వారిని అప్పగించారు.

error: Content is protected !!