News January 18, 2026

జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

image

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

Similar News

News February 18, 2026

భర్త పర్మిషన్ లేకుండా బంధువుల ఇంటికెళ్తే 3 నెలల జైలు శిక్ష!

image

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సరికొత్త క్రిమినల్ కోడ్‌ ఇటీవల అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే మహిళలకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే భార్యలు, పిల్లలను భౌతికంగా శిక్షించే అధికారం భర్తలు, తండ్రులకు ఉంటుంది. అయితే, ఎముకలు విరగొద్దు. చర్మంపై ఏమాత్రం గాట్లు పడొద్దు. ఒకవేళ గాయాలైనట్లు ఆధారం ఉంటే మహిళ కోర్టును ఆశ్రయించొచ్చు.

News February 18, 2026

78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్

image

ఇండోర్‌కు చెందిన సుష్మా మౌఘే మరాఠీ సాహిత్యంలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. గత నలభై ఏళ్లుగా సంగీత ఉపాధ్యాయురాలిగా చేసిన ఆమె కెమిస్ట్రీలో M.Sc కూడా చేశారు. అనేక పుస్తకాలు రచించడంతో పాటు హిందీ పుస్తకాలను మరాఠీలోకి అనువదించారు. 76ఏళ్ల వయసులో దేవి అహల్యా విశ్వవిద్యాలయంలో M.Aలో చేరి తాజాగా జరిగిన స్నాతకోత్సవంలో 78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్ అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

News February 18, 2026

ఫాల్గుణ మాసంలో ఎవరెవరు పుట్టారంటే?

image

ఫాల్గుణ మాసం అనేక పురాణ పురుషుల, మహాత్ముల జన్మలకు వేదిక. ఈ మాసంలోనే హరిహరసుతుడు అయ్యప్పస్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించారు. శ్రీకృష్ణ చైతన్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతి వంటి మహనీయులు కూడా ఈ మాసంలోనే జన్మించారు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు ఈ మాసంలోనే జన్మించారు. కొందరు కౌరవ వీరులు కూడా ఫాల్గుణ మాసంలోనే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి.